యూజీడీ ప్రాజెక్టుపై సాంకేతిక సమీక్షలో పాల్గొన్న కమిషనర్ టి. వెంకన్న
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ అదనపు కార్యదర్శి డి. తారా
వరంగల్ (ఎన్ టుడే న్యూస్): అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి అదనపు కార్యదర్శి డి. తారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు.
ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై చర్చ
ఈ సమావేశంలో యూజీడీ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, అమలు విధానం, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన అంశాలపై సమీక్షించారు.
ఆదాయ వనరుల పెంపుపై వివరాలు
ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రస్తుతం సమకూరుతున్న ఆదాయ వనరులను కమిషనర్ టి. వెంకన్న వివరించారు. కార్పొరేషన్ సొంత ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలు, అదనపు ఆదాయ సమీకరణకు చేపట్టనున్న చర్యలను సమావేశంలో వివరించారు.