BREAKING
thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు
Date of Publish : 02 October 2026, 05:26 pm
Posted by : CHERUKU RAMESH

తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
02 Oct, 2026 - 05:26 PM
4 వీక్షణలు

నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం, తక్కెపహాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

గ్రామ ప్రస్తుత సర్పంచ్ సురేందర్ రెడ్డి గారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి గారు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తయారు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత సర్పంచ్ సురేందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు సమాచారం.

అయితే, ప్రస్తుత సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా, అర్హత లేని కొంతమందికి సైతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు మంజూరైనట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, అర్హతల ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక అత్యంత ముఖ్యమని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.