BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 27 March 2026, 07:24 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధర్మపురి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
27 Mar, 2026 - 07:24 PM
244 వీక్షణలు

ధర్మపురి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ధర్మపురి:

2009 నుండి ప్రతిపక్షంలో ఉంటూ ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రజా సమస్యలపై అవగాహన ఉందని, అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

​శుక్రవారం ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11కేవీ విద్యుత్ లైన్ తొలగింపు పనులు పూర్తి కావడంతో, నూతనంగా ఏర్పాటు చేసిన లైన్‌ను మంత్రి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడిన ముఖ్యాంశాలు:

​30 ఏళ్ల సమస్యకు పరిష్కారం: గత ప్రభుత్వాలు పట్టించుకోని 11కేవీ లైన్ సమస్యను పరిష్కరించడం ద్వారా 110 కుటుంబాలకు ఊరట లభించింది.

​అభివృద్ధి పనులు: ధర్మపురిలో నైట్ కళాశాల, కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. బస్ డిపో నిర్మాణం, గోదావరి పుష్కరాల కోసం బైపాస్ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం.

​విద్యుత్ లైన్ల షిఫ్టింగ్: సుమారు ₹ 4.60 కోట్లతో నియోజకవర్గంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి.

​పరిహారం చెక్కుల పంపిణీ:

విద్యుత్ షాక్‌తో పశువులను కోల్పోయిన బాధితులకు (అనిల్, విజయ, సత్తయ్య, గంగవ్వలకు తలా ₹ 40,000, గంగన్నకు ₹ 7,000) మంత్రి చెక్కులను అందజేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.