BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 01 May 2026, 01:45 pm
Posted by : కూనురు మధు

ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
01 May, 2026 - 01:45 PM
1,033 వీక్షణలు

ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు, NTODAY NEWS చిట్యాల 

తొమ్మిది మందికి గాయాలు అని ప్రాథమిక సమాచారం

​నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలంలో భారీ పేలుడు సంభవించింది. పిట్టాంపల్లి గ్రామం శివారులో ఉన్న 'నోష్ ఫార్మా కాంపెనీ' (NOSCH Lab ) ఫార్మా కంపెనీలో  ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. కంపెనీలోని 3వ బ్లాక్‌లో కార్మికులు విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ​సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ​ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ​పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాల లోపంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.