BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 15 June 2026, 06:11 pm
Posted by : V శ్రీనివాస్

​నూతన విద్యా సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి: అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 06:11 PM
166 వీక్షణలు

​జైపూర్: 2026-27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేసి, నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యను జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావించి, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్యను, ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పోటీ ప్రపంచంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

​అంతకుముందు పాఠశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా గది తదితర మౌలిక వసతులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్లి పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ విజ్ఞానం, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత చరిత్రలు, సాహిత్య పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు. విద్యా సంవత్సరపు మొదటి రోజు నుంచే క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించడంతో పాటు క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు