BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 15 June 2026, 05:32 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 05:32 PM
277 వీక్షణలు

నస్పూర్ సమీకృత కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ

అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఆర్ఓ మోతిరామ్‌లతో కలిసి సమస్యల పరిశీలన

ఇండ్లు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు

​మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌లతో కలిసి ఆయన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు సత్వరమే న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. చెన్నూర్ మండలం ఒతుకులపల్లికి చెందిన కావేరి శోభ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాలకు చెందిన సెగ్గెం ప్రసాద్ జీవనాధారంగా ఆటోతో పాటు రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలని కోరారు. తాండూరు మండలం అచలాపూర్‌లో అక్రమ కల్వర్టు నిర్మాణంతో తమ భూమి ఆక్రమణకు గురవుతుందని కట్ల పోసక్క, కట్ల పోచం ఫిర్యాదు చేయగా.. లక్షెట్టిపేట మండలం మోదెలలో గోదావరి ముంపునకు గురైన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని సత్యనారాయణ రావు అర్జీ సమర్పించారు. అలాగే, దేవాపూర్‌కు చెందిన వెంకటేశం తన కుమారుడికి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో సీటు కేటాయించాలని, జైపూర్ మండలం ఇందారానికి చెందిన కళ్యాణి తనకు గృహజ్యోతి, గ్యాస్ రాయితీ పథకాలు వర్తింపజేయాలని వినతిపత్రాలు అందజేశారు