BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి – చింతలపూడిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 08:07 PM
143 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి శ్రేణులు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాయి. పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో చేయని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.

“అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటే అభివృద్ధి” అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిడిపి చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి మధుబాబు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టిడిపి జిల్లా నాయకులు, చింతలపూడి మండల అధ్యక్షులు చింతం విష్ణు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.