BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 13 May 2026, 02:21 pm
Posted by : కూనురు మధు

నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
13 May, 2026 - 02:21 PM
141 వీక్షణలు

నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు NTODAY NEWS చిట్యాల 

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

​ నీట్  పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో  ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో దేశంలో 89 సార్లు పేపర్ లీకులు జరగడం బీజేపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ​లక్షలాది మంది విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలను కేంద్రం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగినట్లు స్వయంగా ఎన్ టి ఏ అంగీకరించడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చ అని, ఈ మాఫియా వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యువజన కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దామానూరి పృథ్వి, నాయకులు దేశబోయిన లింగస్వామి, అందే చందు, చీమల సతీష్, ఆరూరి చందు, చిన్నం వెంకటేష్, కొండా రాజు, గోషిక అక్షయ్, దేవరపల్లి నవీన్, అందే బన్నీ తదితరులు పాల్గొన్నారు.