BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 27 June 2026, 04:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం అనుముల రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 04:43 PM
97 వీక్షణలు

హైదరాబాద్‌లో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పనుల పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టులో అవసరమైన చోట భూసేకరణ చేపట్టాల్సి వస్తే, భూ యజమానుల ఆసక్తిని బట్టి టీడీఆర్ ఇవ్వడం లేదా తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం "మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్" ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మూసీ ప్రాజెక్టు కింద చేపట్టబోయే పనులు, ప్రాజెక్టు విశేషాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ఈ కేంద్రంలో ప్రదర్శించాలన్నారు.

ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేముల నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు మూసీ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సమావేశంలో ప్రదర్శించారు.