BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 14 August 2026, 08:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కేంద్ర ప్రభుత్వం మారితే మార్పు సాధ్యం.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Aug, 2026 - 08:18 AM
47 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం కానందుకే మార్పు కోసం సిపిఐ...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

 కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మున్నా పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా గురువారం పుంగనూరు భగత్ సింగ్ కాలనీ లో ఇంటింటి ప్రచారం గావించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు.  

 *ఎఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి* మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు  పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ నాయకులు చంద్ర,రత్నమ్మ,సుశీలమ్మ,ప్యరజాన్,మోహన్ తదితరులు  పాల్గొన్నారు.