BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 28 September 2026, 02:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 02:44 PM
17 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మండల విద్యాశాఖ అధికారి–2 వీఎస్‌వీ బ్రహ్మచారి సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, భోజన పదార్థాల నిల్వ, మెనూ అమలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వీఎస్‌వీ బ్రహ్మచారి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, విద్యార్థులకు వేడి, తాజా ఆహారం అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. భోజనం తయారీ, వడ్డింపు సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనంపై వారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బంది, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు సందర్భంగా ఉపాధ్యాయులు జి అమరయ్య విద్యార్థులకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య, ఉపాధ్యాయులు రామారావు వంట ఏజెన్సీ వారు పాల్గొన్నారు