BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 07:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో నవంబర్ 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:50 PM
1 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండలో నవంబర్ 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విద్యార్థులకు వివిధ పోటీలు.. పుస్తక ప్రదర్శన, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు చనుబండ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.రవికుమార్, చనుబండ శాఖా గ్రంథాలయాధికారి కె.శ్రీకాంత్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవంతో పాటు బాలల దినోత్సవం నిర్వహిస్తారు. 15న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పుస్తకాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. 16న గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలందించిన డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య తదితర ప్రముఖులను స్మరించుకుంటూ ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. 17న ‘చదవడానికి నేర్చుకోండి.. నాయకత్వం వహించడానికి నేర్చుకోండి’ అనే నినాదంతో పఠన ప్రాధాన్యతపై కార్యక్రమం చేపడతారు. 18న విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, ప్రశ్నోత్తరాలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. 19న మహిళల కోసం వివిధ పోటీలు ఏర్పాటు చేస్తారు. 20న అక్షరాస్యత దినోత్సవంతో పాటు వారోత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు. గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.