BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్వాన్ తుఫానుపై తాజా అంచనా..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 08:16 PM
1 వీక్షణలు

నవంబర్ 19–20 మధ్య తీరందాటే అవకాశం నవంబర్ 15న వాయుగుండంగా, 17న తుఫానుగా మారే సూచనలు అక్వాన్ తుఫానుకు సంబంధించి నవంబర్ 14వ తేదీ తాజా అంచనాలు వెలువడ్డాయి. ఈ అంచనాల ప్రకారం నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, నవంబర్ 15 నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 17 నాటికి తుఫానుగా మారేందుకు 85 శాతం అవకాశాలున్నట్లు అంచనా వేశారు. నవంబర్ 19 లేదా 20 తేదీల్లో నెల్లూరు–ఒంగోలు మధ్య నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల వరకు ఎక్కడైనా తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే తుఫాను దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మూడు పరిస్థితులపై అంచనాలు మొదటి పరిస్థితి – ఆంధ్రప్రదేశ్‌కు 55 శాతం అవకాశం: తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు కదిలితే నవంబర్ 21 నుంచి 24వ తేదీల మధ్య తూర్పు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పొడి వాతావరణం ఉండవచ్చని పేర్కొన్నారు. రెండో పరిస్థితి – ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు 25 శాతం అవకాశం: తుఫాను ఈ ప్రాంతాల వైపు కదిలితే తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. నవంబర్ 20 తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న చలి తీవ్రత కొంత తగ్గవచ్చని అంచనా. మూడో పరిస్థితి – బంగ్లాదేశ్, మయన్మార్ వైపు 20 శాతం అవకాశం: తుఫాను ఈ దిశగా పయనిస్తే తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి చలిగాలుల ప్రభావం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో పొడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొన్నారు.