BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం
Test 4
Date of Publish : 12 November 2026, 07:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉయ్యూరు: కూటమి అభ్యర్థుల విజయంపై హర్షం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:43 PM
2 వీక్షణలు

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన వై.వి.బి. రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు: కూటమి అభ్యర్థుల విజయంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం స్పష్టమైంది రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, నవంబర్ 12: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వానికి ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. కంకిపాడు మండల జడ్పీటీసీగా గెలుపొందిన దండమూడి పూజిత, పెదవోగిరాల ఎంపీటీసీగా విజయం సాధించిన చాగంటి నాగలక్ష్మి గురువారం ఉయ్యూరులో రాజేంద్రప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విజయం సాధించిన అభ్యర్థులను అభినందించి, ఘనంగా సత్కరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రజలు కూటమి అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించారని తెలిపారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు మంచి జరగాలనే ఆకాంక్షతో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ చేదుర్తిపాటి ప్రవీణ్, కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, టీడీపీ నాయకులు జంపన వీరశ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, షాదీఖానా మాజీ చైర్మన్ ఖుద్దూస్, 13వ వార్డు కౌన్సిలర్ బొర్రా సుబ్బారావు, చాగంటి పోతిరెడ్డి, చలపాటి శ్రీను, జంపన నరసింహారావు, సలీం, రసూల్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.