BREAKING
thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన thumb ● గ్రామ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సర్పంచ్ వినతిపత్రం thumb ● అయ్యప్పదీక్ష మాలధారణ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం thumb ● కన్నీటి వీడ్కోలు.. ప్రజాసేవకుడిని కోల్పోయిన నారాయణపురం మండలం thumb ● ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన thumb ● గ్రామ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సర్పంచ్ వినతిపత్రం thumb ● అయ్యప్పదీక్ష మాలధారణ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం thumb ● కన్నీటి వీడ్కోలు.. ప్రజాసేవకుడిని కోల్పోయిన నారాయణపురం మండలం thumb ● ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు
Test 4
Date of Publish : 12 November 2026, 06:17 pm
Posted by : K MAHESH

సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:17 PM
18 వీక్షణలు

చారిత్రక కట్టడాలను కాపాడేందుకు అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు

సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలోని పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటుండటంతో వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడాలను భావితరాలకు అందించేందుకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గ్రామంలోని పురాతన కట్టడాల పరిస్థితిని వివరిస్తూ, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడాలు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వాటిని సంరక్షించేందుకు సంబంధిత శాఖల ద్వారా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం నారాయణపురం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతిని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, గ్రామ పాలకవర్గ సభ్యులు కలిసి కట్టడాల పరిస్థితిని వివరించారు. గ్రామంలోని పురాతన నిర్మాణాల ప్రాధాన్యతను, వాటి ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఇలాంటి అద్భుతమైన కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాలంటే వాటిని పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పురాతన కట్టడాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ స్పందనతో గ్రామంలోని పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు ముందుకు సాగుతాయని గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సీహెచ్ నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ కొన్‌రెడ్డి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మందుగుల బాలకృష్ణ, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, ఎండీ అలీం యూసుఫ్, సభావత్ రఘునాయక్, చింతల శైలజ, సత్యనారాయణ, సింగం బిక్షపతి, సింగపంగా ప్రశాంతి, రమేష్, నీళ్ల అనిత, శంకర్, బల్గూరి శివసాగర్, పట్నం బాలకృష్ణ గౌడ్, పద్మశాలి సహకార సంఘం చైర్మన్ చిలుకూరి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, గునిగంటి రాజు గౌడ్, వడ్డేపల్లి శివప్రసాద్, బానోతు కిరణ్ నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.