BREAKING
thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన
Test 4
Date of Publish : 12 November 2026, 06:30 pm
Posted by : K MAHESH

గ్రామ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సర్పంచ్ వినతిపత్రం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:30 PM
2 వీక్షణలు

రెవెన్యూ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి.. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 12: నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ చిలుకరాజు చందన రాజు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. గురువారం కలెక్టర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామంలోని రెవెన్యూ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే అవకాశం ఉన్న కరువు పరిస్థితులపై సర్పంచ్ కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అలాగే రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా సర్వేల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 311లో భూములు కలిగిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఆయా భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ, భూ సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సర్పంచ్ చిలుకరాజు చందన రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.