BREAKING
thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
Test 4
Date of Publish : 12 November 2026, 07:19 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:19 PM
3 వీక్షణలు

లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాల పురోగతిని తెలుసుకున్న జలంధర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించేందుకు వలిగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి మండలంలోని సంగెం, నెమలికల్వ, గోకారం, వర్కట్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో కలిసి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు రియల్‌టైమ్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మంజూరైన నిధుల పరిధిలోనే ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

అనంతరం ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శించిన ఎంపీడీవో కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికతో పాటు ఇతర రికార్డులను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, విధుల పట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జలంధర్ రెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పనులు సమర్థవంతంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.