BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:35 pm
Posted by : K MAHESH

నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:35 PM
8 వీక్షణలు

రామన్నపేటలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు.. గోడపత్రిక ఆవిష్కరించిన రైతు సంఘం నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట: నవంబర్ 15 నుంచి నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రామన్నపేట మండల కేంద్రంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు గోడపత్రికను ఆవిష్కరించారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, రైతు సంఘం మండల నాయకత్వంతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవంబర్ 15న నల్లగొండలో జరిగే జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రామన్నపేట మండలంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

జాతీయ మహాసభల సందర్భంగా నాలుగు రోజుల పాటు వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తులు, ఆధునిక యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు విధానాలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమాలకు నల్లగొండ మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన చారిత్రక నేపథ్యం కలిగిన నల్లగొండ గడ్డపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించేందుకు రైతులంతా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షుడు బోయిని ఆనంద్, కార్యదర్శి గన్నెబోయిన విజయభాస్కర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి నగేష్, గొరిగే సోములు, ఎండీ రషీద్, మునికుంట్ల లెనిన్, గట్టు నర్సింహా, మేడి ముకుంద, శానగొండ రాము, భోగ సహదేవ, ఎర్ర రవీందర్, గుణగంటి మల్లేశం, బండ జగన్మోహన్ రెడ్డి, తాటిపాముల నవీన్, ఇర్వి రవి, నాగటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.