BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:24 pm
Posted by : K MAHESH

మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:24 PM
6 వీక్షణలు

ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు.. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు

నెల్లికుదురు: మండల పరిధిలోని మేచరాజుపల్లి, పెద్దతండా గ్రామాల్లో ఎన్టీపీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను గురువారం ప్రారంభించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో మంజూరైన ఈ లైట్లను పెద్దతండా సర్పంచ్ బాదావత్ సుధారాణి సురేష్ నాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పర్నే ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన తండాలు, గ్రామాల అభివృద్ధి కోసం హుస్సేన్ నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన చొరవ, పట్టుదలతోనే మేచరాజుపల్లి, పెద్దతండా గ్రామాలకు సోలార్ లైట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తండాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేశారని వివరించారు.

గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటు వల్ల రాత్రి వేళల్లో ప్రజలకు వెలుతురు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు రాత్రి సమయాల్లో ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రజల భద్రతకు కూడా ఈ లైట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

గిరిజన తండాల అభివృద్ధికి సహకరిస్తూ, తమ గ్రామాలకు సోలార్ లైట్లు మంజూరు చేయించడంలో చొరవ చూపిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు మేచరాజుపల్లి, పెద్దతండా గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బాదావత్ నవీన్, కోటగిరి అశోక్ గౌడ్, కోటగిరి మురళి, పెద్దతండా ఉపసర్పంచ్ బాదావత్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ యాకేందర్, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు సంపత్ రావు, బూత్ అధ్యక్షుడు గుంశావళి, మండల నాయకులు విజయ్, సంపత్ రావు, పెద్దతండా బీజేపీ బూత్ అధ్యక్షుడు బాదావత్ దినేష్, వార్డు సభ్యులు బానోత్ సురేష్, పాల్తే లక్ష్మి, తండా నాయకులు పాల్త్య రవి, యువత తదితరులు పాల్గొన్నారు.