BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:22 pm
Posted by : K MAHESH

యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:22 PM
6 వీక్షణలు

పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి.. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి, ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు.

గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులందరికీ పంటల వారీగా పరిహారం అందించాలని కోరారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, కంది పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా రైతులు తీసుకున్న పంట రుణాల చెల్లింపులను వాయిదా వేయాలని, వడ్డీ మాఫీ చేసి రుణాలను రీషెడ్యూల్ చేసే సౌకర్యం కల్పించాలని సూచించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టడంతో పాటు సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలని మరోసారి స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు.

ధర్నా అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డికి సీపీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, బచ్చనగోని గాలయ్య, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, ఏశాల అశోక్, పేరబోయిన మహేందర్‌తో పాటు జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.