BREAKING
thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
Test 4
Date of Publish : 12 November 2026, 07:21 pm
Posted by : K MAHESH

ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి..

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:21 PM
2 వీక్షణలు

31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం: జాయింట్ యాక్షన్ కమిటీ

నర్సంపేట, నవంబర్ 12: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 31 రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని జాతీయ ఆరోగ్య మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన ఉద్యోగుల సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

గత 31 రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగులుగా సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చనే విషయం తమకు తెలుసని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ ఉద్యోగ హక్కులు, జీవనోపాధి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈ సమ్మె ఎవరిపైనా కక్షతో చేస్తున్నది కాదని, తమ బతుకుదెరువు, న్యాయమైన హక్కుల సాధన కోసమే చేపట్టిన పోరాటమని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వెంటనే జాతీయ ఆరోగ్య మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్లు:

  1. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలి.

  2. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

  3. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.

  4. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన ఉద్యోగులను గుర్తించి న్యాయం చేయాలి.

ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.