BREAKING
thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన
Test 4
Date of Publish : 12 November 2026, 06:43 pm
Posted by : K MAHESH

కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:43 PM
2 వీక్షణలు

రోడ్ల నిర్మాణంలో జాప్యంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శలు

కురవి: డోర్నకల్ నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ జిల్లా ప్రజలు కందగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి, కందగిరి క్షేత్ర అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలులో జాప్యం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

గురువారం కురవి మండలంలోని కందగిరి క్షేత్రం (పర్వతం) వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఐలు నరహరితో కలిసి సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

రోడ్ల పనులకు మంజూరైన నిధులు వృథా అవుతున్నాయి

తాను మంత్రిగా ఉన్న సమయంలో సుమారు రూ.9.30 కోట్లతో పలు రోడ్ల పనులకు నిధులు మంజూరు చేయించినట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూడా రూ.3.5 కోట్లతో అయ్యగారిపల్లి నుంచి కందగిరి పర్వతం వరకు, అక్కడి నుంచి బంజారా తండా వరకు రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ పనుల్లో దాదాపు 70 శాతం పూర్తయినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో రోడ్ల పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ చూపకపోవడంతో పనులు నిలిచిపోయాయని, నిధులు మంజూరైనప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులపై విమర్శలు

నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల పురోగతిపైనా సత్యవతి రాథోడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల నిర్మాణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. తొలుత కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని భావించానని, ఆ తర్వాత గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ మట్టిని తరలించకపోవడం వల్లే సమస్య ఏర్పడినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని ఆమె ఆరోపించారు. అభివృద్ధి పనులకు నిధులు ఎలా తీసుకురావాలి, వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో సరైన చర్యలు తీసుకుంటే పనులు త్వరగా పూర్తయ్యేవని అన్నారు.

కందగిరి పర్వతం రోడ్లు, మెట్ల మార్గం ఎక్కడ?

కందగిరి పర్వతానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పర్వతం చుట్టూ రోడ్డు నిర్మాణంతో పాటు కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని గతంలో కోటిన్నర రూపాయలు మంజూరు చేయించినట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ పనులకు సంబంధించిన పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.

మంజూరైన నిధులతో పనులు పూర్తి చేయించలేని పరిస్థితిలో రోప్‌వేను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కందగిరి క్షేత్రానికి వచ్చే భక్తుల పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా నిలిచిపోయిన రోడ్ల పనులను పూర్తి చేయాలని సూచించారు.

రోడ్లపై కంకర రాళ్లు ఉండటంతో జాతరకు వచ్చే భక్తులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్యలే ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలుగా మారతాయని రాజకీయ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసేలోపు ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆమె ఆరోపించారు.

నియోజకవర్గానికి రూ.300 కోట్ల వరకు రోడ్ల నిధులు తెచ్చా

తాను మంత్రిగా ఉన్న సమయంలో డోర్నకల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం సుమారు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నిధులు మంజూరు చేయించినట్లు సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ పనులు అనేక చోట్ల నిలిచిపోయాయని, మంజూరైన నిధులకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శించారు.

మరిపెడ వంద పడకల ఆసుపత్రికి నేనే నిధులు తీసుకొచ్చా

మరిపెడలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి తానే నిధులు మంజూరు చేయించానని, అప్పట్లో మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి శంకుస్థాపన చేసినట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. అయితే కాంట్రాక్టర్ మార్పు, పనుల ప్రారంభంలో జాప్యం కారణంగా నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కమిషన్ల అంశం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు.

నియోజకవర్గంలో గతంలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయించడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని సత్యవతి రాథోడ్ కోరారు. కందగిరి పర్వతానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఐలు నరహరి, బాదే నాగన్న, మాజీ సర్పంచులు బోడ శ్రీను నాయక్, ధన్‌సింగ్ నాయక్, బండి మాదయ్య, వెంకట గౌడ్, నెహ్రూ నాయక్, వెంకన్న, ఉప్పలయ్య, మలుసూరు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.