BREAKING
thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన
Test 4
Date of Publish : 12 November 2026, 06:32 pm
Posted by : K MAHESH

భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:32 PM
2 వీక్షణలు

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలి.. ప్రకృతి అనుకూల సాగు పద్ధతులు అవలంబించాలి

బయ్యారం: భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించేందుకు రైతులు ప్రకృతి అనుకూల వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, స్థానికంగా లభించే సహజ వనరులతో వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

బయ్యారం మండలం కొత్తపేట క్లస్టర్ పరిధిలోని సింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సపావత్ సరస్వతి రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అజ్మీరా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పంటను పదేపదే సాగు చేయకుండా పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలని తెలిపారు. అంతర పంటల సాగు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం ద్వారా నేలలో సారాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయంలో ప్రకృతి అనుకూల పద్ధతులను పాటించడం వల్ల భూమి సారవంతంగా ఉండటంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు.

అనంతరం జాతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. స్థానికంగా అందుబాటులో ఉండే సహజ వనరులను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకునే విధానం, వాటి వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు పొందడంతో పాటు నేల ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే. రాజు, ఏఈఓ నాగరాజు, గ్రామ ఉపసర్పంచ్ చుంచు మమత, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.