BREAKING
thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి.. డీసీహెచ్‌ఎస్ వై. సూర్యశ్రీరావు thumb ● నల్లగొండలో రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● మేచరాజుపల్లి, పెద్దతండాలో సోలార్ లైట్లు ప్రారంభం thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన
Test 4
Date of Publish : 12 November 2026, 06:40 pm
Posted by : K MAHESH

గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:40 PM
2 వీక్షణలు

త్వరగా కోలుకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలి.. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయాలని భరోసా

కొరివి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో స్వల్పంగా గాయపడిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. గురువారం కందికొండ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మండలంలోని కందికొండ గ్రామానికి చెందిన కొప్పుల వెంకన్న ఇటీవల ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా కందికొండ స్టేజి వద్ద ఇసుక కారణంగా బండి స్కిడ్ అయి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి రాథోడ్ గురువారం వెంకన్న స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా వెంకన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన కుమారుడు ఎస్‌ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సతీష్ వద్ద వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని, వెంటనే అందుబాటులోకి వస్తానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యుడిగా ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. వెంకన్న త్వరగా కోలుకొని తిరిగి వైద్య సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఐలు నరహరి, బాదే నాగన్న, మాజీ సర్పంచ్ బోడ శ్రీను నాయక్, ధన్‌సింగ్ నాయక్, సర్పంచ్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, బండి మావయ్య, మెట్టు ఉప్పలయ్య, బయ్య శ్రీను, బొడ్డు రమేష్, గూగులోతు ఉపేందర్, ధరావత్ నరసింహ, బోడ వీరన్న, చలమల వెంకన్న, జటంగ సుధాకర్, బోడ బిక్షం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.