BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 07:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విష్ణుపురంలో మహిళా సమైక్య భవనం ప్రారంభం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:07 PM
2 వీక్షణలు

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి మండలం విష్ణుపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ అనూష రవితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భవనాన్ని ప్రారంభించి మహిళా సంఘాల సభ్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన పొందాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఐక్యత, ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడంతో పాటు బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళా సమైక్య భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా మహిళల సమస్యలపై చర్చించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించేందుకు, నూతన ఆలోచనలకు వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ మహిళల అభ్యున్నతికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.