వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం
విజయవాడ: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అధ్యక్షతన సోమవారం విజయవాడ రామవరప్పాడు సమీపంలోని కె. హోటల్‌లో పార్టీ ముఖ్య సమావేశం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
సమావేశంలో రాబోయే పార్టీ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని వారు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని వారు పేర్కొన్నారు.