సీఐ అహ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సీపీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా గోపన్నపాలెంలోని సీఐ అహ్మద్ అలీ నివాసానికి విజయవాడ పోలీస్ కమిషనర్ చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పోలీసు శాఖ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విజయవాడ సీపీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు గోపన్నపాలెం చేరుకుని అహ్మద్ అలీ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.