BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 14 August 2026, 08:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆటోనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:16 AM
63 వీక్షణలు

ఆటోనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఏలూరు: ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోనగర్‌లో శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, అతిథిగా పాలగూడెం పంచాయతీ ప్రత్యేక అధికారి చింతమనేని విష్ణు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆటోనగర్ సభ్యులు, ఆటోమొబైల్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్రి ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, కమిటీ సభ్యులు షేక్ జుల్ఫీ, మంతెన వెంకటేశ్వరరావు, సిగిరెడ్డి సంజీవరావు, బొడ్డు సురేష్, చిట్యాల పూర్ణచంద్రరావు, కార్మిక సంఘం నాయకుడు కురెళ్ల వరప్రసాద్, మాజీ ఉపాధ్యక్షుడు పల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.