రాష్ట్రంలో కొత్తగా 41 బార్లకు నోటిఫికేషన్
రూ.లక్ష దరఖాస్తు రుసుము.. అక్టోబర్ 12 వరకు దరఖాస్తుల స్వీకర
హైదరాబాద్, సెప్టెంబర్ 28:
రాష్ట్రంలో కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2బీ కేటగిరీ కింద ఈ బార్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు శాఖ వెల్లడించింది.
వీటిలో క్యూర్ పరిధిలో 14 బార్లు, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
కొత్త బార్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.లక్ష దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, సమీప గ్రామాల విలీనం తదితర కారణాలతో ఆయా ప్రాంతాల్లో జనాభా పెరిగిందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా బార్ల సంఖ్యను పెంచేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.