BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 28 September 2026, 10:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మారుతినగర్‌లో అధ్వాన్నంగా రోడ్లు.. బురదమయంగా మారిన కాలనీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 10:52 AM
3 వీక్షణలు

మారుతినగర్‌లో అధ్వాన్నంగా రోడ్లు.. బురదమయంగా మారిన కాలనీ దోమల బెడదతో అవస్థలు పడుతున్న కాలనీ వాసులు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని మారుతినగర్ కాలనీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలనీలోని రహదారులన్నీ బురదమయంగా మారడంతో పాటు పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి.

రోడ్లపై నీరు నిలిచిపోవడంతో దోమల బెడద కూడా తీవ్రంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. దోమల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కాలనీలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో కనీసం నడిచేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మారుతినగర్‌లో రోడ్ల అభివృద్ధితో పాటు వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నగర పంచాయతీ అభివృద్ధికి మంజూరైన నిధులను వినియోగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

నగర పంచాయతీ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారులు మారుతినగర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోడ్ల అభివృద్ధి, పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.