BREAKING
thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి
Test 4
Date of Publish : 12 November 2026, 08:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగోలులో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 08:53 AM
48 వీక్షణలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. 108 మెట్లకు దీపాలంకరణ 

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామంలోని అయ్యప్ప స్వామి మందిరం వద్ద బుధవారం రాత్రి పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో మాలధారణ స్వాములు, గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ, గుంత వెంకటేశ్వర్లు గురుస్వామి ముందుగా శ్రీ గణపతి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు పవిత్రమైన 108 మెట్లను దీపాలతో అలంకరించి, వివిధ రకాల పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి సంప్రదాయబద్ధంగా వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి భక్తితో పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్త బృందం ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాటలు, భజనలు, స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాలధారణ స్వాములు, గ్రామస్తులు, భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పూజా కార్యక్రమాలు, భజనలు ముగిసిన అనంతరం విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహార భిక్ష ఏర్పాటు చేశారు. పెనుగోలు అయ్యప్ప స్వామి మందిరం వద్ద ప్రతి బుధవారం పడిపూజ, భజన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.