BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:38 am
Posted by : కూనురు మధు

విద్యార్థుల భవిష్యత్తుకు ఐ సడక్, అబెర్టిస్ సంస్థల అండ

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
14 Aug, 2026 - 08:38 AM
145 వీక్షణలు

విద్యార్థుల భవిష్యత్తుకు ఐ సడక్, అబెర్టిస్ సంస్థల అండ

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు ఐ సడక్ సంస్థ, అబెర్టిస్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం సుమారు రూ.4.50 లక్షల విలువైన సామగ్రిని అందజేశారు. సంస్థలు చేపట్టిన సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాలకు 5 కంప్యూటర్లు, ఒక సౌండ్ సిస్టమ్, 108 మంది విద్యార్థులకు ప్యాంట్‌–టీషర్ట్‌తో కూడిన స్పోర్ట్స్‌ డ్రెస్సులు, 108 స్పోర్ట్స్‌ కిట్లు, క్రీడా సామగ్రిని అందించారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ విద్య మరింత చేరువకానుండగా, సౌండ్‌ సిస్టమ్‌ పాఠశాల కార్యక్రమాలకు ఉపయోగపడనుంది అని,  క్రీడా దుస్తులు, కిట్లు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంపొందించనున్నాయని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. ఈ సహాయం అందించడంలో ప్రత్యేకంగా సహకరించిన రేణుక మేడం, పల్లా శ్రీనివాసరెడ్డిలకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సంస్థలు, సమాజం కలిసి పనిచేస్తే సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించిన ఈ సహాయం కేవలం వస్తువుల రూపంలో కాకుండా వారి ప్రతిభ, కలలు, భవిష్యత్తును ప్రోత్సహించే గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐ సడక్, అబెర్టిస్ సంస్థల ప్రతినిధులకు, రేణుక మేడం, పల్లా శ్రీనివాసరెడ్డికి, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ కన్య గ్రామ సర్పంచ్ రావుల స్వప్న రమేష్ , ఉప సర్పంచ్ గంగన్న బోయిన మహేష్ , మాజీ ఎంపిటిసి కంపేర్ దుర్గయ్య , గ్రామ పెద్దలు చల్లమల యాదగిరి రెడ్డి , రిజ్వాన , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. బి. రాములు  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు