BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 10:12 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
28 Sep, 2026 - 10:12 PM
11 వీక్షణలు

ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు పర్యాటకం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవం–2.0కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం అంబేద్కర్ కళా వేదికలో ఘనంగా జరిగింది.


రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించగా, ఈ ఏడాది మరింత విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

విజయవాడ ఉత్సవం కేవలం సాంస్కృతిక కార్యక్రమానికే పరిమితం కాకుండా నగర బ్రాండ్‌ను మరింతగా విస్తరించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఉపాధికి వేదికగా నిలవాలన్నదే ఉద్దేశమని ఎంపీ తెలిపారు.

దసరా సందర్భంగా విజయవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున నగర ప్రజలు వారికి ఆతిథ్య భావంతో స్వాగతం పలకాలని కోరారు. ఇళ్లు, వ్యాపార సంస్థలను ప్రత్యేకంగా అలంకరించి నగరాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను విజయవాడ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల ద్వారా స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, కళాకారులు తదితర వర్గాలకు ఆదాయ, ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు.

650 స్టాళ్లతో నేషనల్ సరస్ మేళా

విజయవాడ పున్నమి ఘాట్‌లో తొలిసారిగా నేషనల్ సరస్ మేళా నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

మొత్తం 650 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు, ఇందులో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలకు 230 స్టాళ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఉత్సవాలు ఆర్థిక వృద్ధికి దోహదపడాలి: మంత్రి దుర్గేష్

విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న కృషిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున ఉత్సవాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఉత్సవాలు కేవలం వినోద కార్యక్రమాలుగా కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా ఉండాలని అన్నారు. వీటి ద్వారా స్థానిక వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు, కళాకారులకు ఆదాయ అవకాశాలు పెరగాలని పేర్కొన్నారు.

అంతరించిపోతున్న తోలుబొమ్మలాట, తప్పెటగుళ్లు వంటి జానపద కళలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పద్య, పౌరాణిక నాటకాలకు కూడా ఉత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చాటాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడకు చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ ఉత్సవాల ద్వారా నగర ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే అవకాశం కలుగుతుందని అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. దసరా సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ ఉత్సవాలు పర్యాటక అభివృద్ధి, స్థానిక ఉపాధి, వ్యాపార అవకాశాల పెంపునకు వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కుటుంబాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

ట్రైలర్, పాట, పోస్టర్ల ఆవిష్కరణ

కార్యక్రమంలో విజయవాడ ఉత్సవం–2.0కు సంబంధించిన ట్రైలర్, ఉత్సవ పాటను మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కలిసి ఆవిష్కరించారు.

విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా రూపొందించిన ట్రైలర్‌లో గతంలో నిర్వహించిన విజయవాడ ఉత్సవానికి సంబంధించిన దృశ్యాలను పొందుపరిచారు. ప్రజల అనుభూతులను ప్రతిబింబించేలా రూపొందించిన వీడియో ఆకట్టుకుంది.

అలాగే విజయవాడ ఉత్సవం పోస్టర్‌తో పాటు జిజ్ఞాస ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు సంబంధించిన పోస్టర్లను అతిథులు ఆవిష్కరించారు.

ప్రజల ఉత్సవంగా విజయవాడ ఉత్సవం–2.0

విజయవాడ ఉత్సవం–2.0 నగర ప్రజలందరి ఉత్సవంగా నిలవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నగర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మికతతో పాటు స్థానిక వాణిజ్యానికి ప్రోత్సాహం కల్పించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు పట్టాభి, ఎం.ఎస్. బేగ్, రఘురామరాజు, లంక దినకర్, తేజస్వి, పేరేపి ఈశ్వర్, గుమ్మడి జయరాజ్, రామ్ ప్రసాద్ తదితరులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.