BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 10:09 pm
Posted by : BOYA SWAMY

అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించాలి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి / అమంగల్
Reporter
Boya Swamy Chityala Mandal
28 Sep, 2026 - 10:09 PM
10 వీక్షణలు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పరిపాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు.

దేశంలో జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్యలో తగ్గుదల ఎలా జరుగుతుందనే అంశంపై సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ వంటి ప్రక్రియలు పారదర్శకంగా, ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండాలని అన్నారు. ఓటు హక్కుకు సంబంధించి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణలో కొనసాగుతున్న SIR ప్రక్రియపై ఓటర్ల పేర్ల తొలగింపుకు సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రస్తావించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

‘ది కాంక్లేవ్ 2026’లో సీఎం వ్యాఖ్యలు

అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘India’s Next Chapter’ అంశంపై జరిగిన చర్చలో దేశ భవిష్యత్ దిశ, విద్య, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, నియోజకవర్గాల పునర్విభజన, SIR తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలి

దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక వనరులు, మానవ వనరుల ఆధారంగా ఆర్థిక సామర్థ్యాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేలా కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు వంటి ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళన

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనను ఆయన గతంలోనూ వ్యక్తం చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

తెలంగాణను విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ఆధారంగా అభివృద్ధి చేసి దేశ ప్రగతిలో రాష్ట్రాన్ని కీలక భాగస్వామిగా నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు.

యువతకు విద్యతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నర్సరీ విద్య వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్లో భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, 12వ తరగతి అనంతరం ఉపాధి, వృత్తి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.