తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్
సంతోష్ నగర్ చౌరస్తాలో సీపీఎం నిరసన ర్యాలీ
ఎల్బీనగర్ సెప్టెంబర్28/ఎన్ టుడే న్యూస్.
14 దఫాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి,13 కోట్ల ఓటర్లను తొలగించిన నిరంకుశ ఎన్నికల ప్రధానాధికారి ఙ్ఞానేష్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని సీపీ ఎం రాష్ట్ర నేత ఎం డి అబ్బాస్ డిమాండ్ చేశారు.
- నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్ట్) హైద్రాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సంతోష్ నగర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కు కీలకమైన ఎన్నికల సంఘం కు ప్రధానాధికారి గా ఉన్న ఙ్ఞానేష్ కుమార్,తన సహచర కమిషనర్లు,14 సార్లు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ,పట్టించుకోకుండా,నిరంకుశ మోడీ ప్రభుత్వం ఎలా చేయమంటే అలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏకపక్షంగా చేసి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ( ఎస్ ఐ ఆర్ ) పేరుతో 13 కోట్లమంది ఓట్లను తొలగించారని,ఒక్క తెలంగాణలోనే 90 లక్షలదాక ఓటర్లకు నోటీస్ లు ఇచ్చారని,ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల అధికారాలను డిల్లీ కేంద్ర ఎన్నికల డిజిటల్ వ్యవస్థకు అను సందానం చేశారని,ఆందోళనా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని , పోరాటమే పరిష్కారమని,సూచించారు.
-ఈ నెల 30 న రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద బారీ ధర్నా వామపక్ష,ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యం లో ధర్నా చేయనున్నామని తెలిపారు- ఈ నిరసన కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.నాగేశ్వర్,ఎం మీనా,జి.విఠల్,ఎల్ కోటయ్య, , కార్యవర్గ సభ్యులు ఎం లక్ష్మమ్మ,ఎస్.కిషన్,అబ్దుల్ లతీఫ్,కే జంగయ్య తదితరులు పాల్గొన్నారు.