BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 08:16 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
28 Sep, 2026 - 08:16 PM
16 వీక్షణలు

హనుమకొండ: ఎల్కతుర్తి మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత జంగం రాజు మృతి చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ముందుండి నడిపించిన రాజు మృతి పట్ల ఎల్కతుర్తి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా యువత, తోటి ఉద్యమకారులు ఆయన మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు విశేష సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువకులను పెద్ద ఎత్తున ఉద్యమంలోకి తీసుకురావడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వంటా వార్పు వంటి కార్యక్రమాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.

ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించిన రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సగం గుండు గీయించుకుని ఉద్యమానికి మద్దతుగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారని తోటి ఉద్యమకారులు, గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు.

జంగం రాజు మృతి విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన తోటి ఉద్యమకారులు ఎల్కతుర్తికి చేరుకుని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో రాజు పోషించిన పాత్ర మరువలేనిదని గ్రామస్థులు, ఉద్యమకారులు పేర్కొన్నారు.

రాజుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించిన రాజు మృతితో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి ఉద్యమకారులు కోరారు.