BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 04:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 04:43 PM
193 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురంలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో రెండు పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీఎచ్‌వో ఐ. తబిత, ఏఎన్‌ఎం పుష్పలత వెల్లడించారు.

ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి చిన్నారిని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు.

పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామంలోని అర్హులైన చిన్నారులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు.సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు