BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చాట్రాయిలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ, పోలియో చుక్కల కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 03:01 PM
106 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.

మండలంలోని ఐదేళ్లలోపు 4,400 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ నాగమణి, ఎంపీహెచ్‌ఈఓ శ్రీధర్, హెల్త్ విజిటర్ జానకి, హెల్త్ సూపర్‌వైజర్ ప్రభాకర్, అన్ని ఎంఎల్‌హెచ్‌పీలు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు వాణి, కీర్తి, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారు.

అలాగే చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కూడా కార్యక్రమంలో భాగస్వాములై ప్రజల్లో పోలియో చుక్కలపై అవగాహన కల్పిస్తున్నారు. పోలియో చుక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గ్రామాల్లో అవగాహన ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కలిసి గ్రామాల్లో పోలియో చుక్కల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో పోలియో నివారణపై చైతన్యం కల్పించారు.

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకురావాలని మండల వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి కోరారు.