BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 14 August 2026, 06:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి దేవాలయ రాజగోపురానికి కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
14 Aug, 2026 - 06:35 AM
49 వీక్షణలు

శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి దేవాలయ రాజగోపురానికి కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం 

పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి రెడ్డి రాఘవేంద్ర రాజు 

అన్నమయ్య జిల్లా - పుంగనూరు పట్టణంలో జమీందారు వంశీయులు రాజ సుగుటూరు

ఇమ్మడి సోమశేఖర రాయలు మరియు రాజ సుగుటూరు ఇమ్మడి మల్లిఖార్జున రాయలు పూర్వ జమీందార్లు యోలుబడిలో వుండి ప్రస్తుతము దేవదాయశాఖ పరిపాలనలో ఉన్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి నూతన రాజగోపురం, కలశప్రతిష్ట, శ్రీవైఖానస ఆగమోక్త ప్రకారం జరుపబడును.

ఆగస్టు 14, 2026 శుక్రవారం నుంచి ఆగస్టు 17, 2026 సోమవారం పంచమి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. చిత్తా నక్షత్ర యుక్త శుభలగ్నంలో, ఉదయం 9:00 గంటల నుంచి 10:12 గంటల వరకు శుభకన్యా లగ్నంలో రాజగోపుర సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరగనుంది.


ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.


 కార్యక్రమ వివరాలు.




14-08-2026 శుక్రవారం సాయంత్రం


శ్రీ భగవత్ ప్రార్ధన, స్వస్తివాచనం, పంచగవ్య ఆరాధన, రక్షబంధనం, ఆచార్య ఋత్విక్త వరుణం, ఆగ్ని ప్రతిష్ఠ, శాలవాస్తు అంకురార్పణం కళావాహన, కుంభారాధన, ప్రధాన నిత్యహోమం, సర్వదైవత్య హోమం, హారతి, తీర్థప్రసాద వినియోగం.


15-08-2026 శనివారం ఉదయం


స్వస్తివాచనం, కలశారాధాన, ప్రధాన నిత్యహోమం, ఆధిహసత్రయం 1. పంచగవ్యధివాసం, 2. క్షీరాధివాసం 3. జలధివాసం, హారతి, తీర్థ ప్రసాద వినియోగం.


సాయంత్రం: స్వస్తివాచనం, కలశారాధన, ప్రధాన నిత్యహోమం, సారమూత్ని విశేష హోమం, హరతి, తీర్థ ప్రసాద వినియోగం.


16-08-2026 ఆదివారం ఉదయం


స్వస్తివాచనం, కలశారాధన. ప్రధాన నిత్యహోమం, విశేష హోమం, చతుర్ధ శకలశ స్నపనం నవకలశ అభిషేకం, మహాశాంతి అభిషేకం, హారతి. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు రాజగోపురం పైన కలశ ప్రతిష్ఠ హారతి.


సాయంత్రం: స్వస్తివాచనం, కలశారాధన, ప్రధాన నిత్యహోమం, విశేష హోమం, ఏకాంతసేవ, హరతి, తీర్థ ప్రసాద వినియోగం.


17-08-2026


సోమవారం ఉదయం


స్వస్తివాచనం, కలశారాధన, ప్రధాన నిత్యహోమం, విశేష హోమములు మహ పూర్ణాహుతి, కళావాహనం. ఉదయం 9 గంటల నుండి 10 గంటల 12 ని॥ వరకు శుభ కన్యాలగ్నము నందు రాజగోపుర కుంభాభిషేకం, గోదర్శనం, మహాకుంభ హారతి, తీర్థ ప్రసాద వినియోగం. ఆచార్యమర్యాద, మహాదిశ్వివచనం, అర్చక బహుమానం.


ఉదయం 11 గంటలకు శ్రీదేవి- భూదేవి సమేత శ్రీ మాణిక్య వరద ' రాజస్వామివారికి లోక కళ్యాణార్థం మహాశాంతి కళ్యాణోత్సవము జరుగును.


ఆలయ ప్రధాన అర్చకులు


శ్రీ ఎ.ఎస్. క్రిష్ణమాచార్యులు


సహాయ అర్చకులు


శ్రీ ఎ.ఎస్. శ్యామసుందరాచార్యులు


శ్రీ ఎ.ఎస్. హేమంత్కుమార్ చార్యులు


శ్రీ ఎ.ఎస్. సాయిప్రకాష్ చార్యులు


J. ఏకాంబరం, B.A.,


కార్యనిర్వహాణాధికారి & ఉప కమీషనరు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవస్థానము, పుంగనూరు (T & M), అన్నమయ్య జిల్లా.