BREAKING
thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి
Test 4
Date of Publish : 28 September 2026, 02:17 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Sep, 2026 - 02:17 PM
86 వీక్షణలు

విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

కనిగిరి, సెప్టెంబర్ 28:

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించాయి. పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచనల మేరకు సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ సమాజ సంస్కరణ కోసం సాహిత్యాన్ని సాధనంగా మలచుకుని సామాజిక అసమానతలు, వివక్ష, అంటరానితనంపై తన రచనల ద్వారా గళమెత్తిన కవి గుర్రం జాషువా అని పేర్కొన్నారు. ఆయన సాహిత్యంలో మానవ సమానత్వం, సామాజిక చైతన్యం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయని తెలిపారు.

మూఢనమ్మకాలు, సామాజిక వివక్షపై తన పద్యాల ద్వారా ప్రశ్నలు లేవనెత్తిన జాషువా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన సాహిత్య సందేశాన్ని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గుర్రం జాషువా జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, మడతల కస్తూరి రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, చింతగుంట్ల సాల్మన్ రాజు, కటికల వెంకటరత్నం, రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, మూలె గోపాల్ రెడ్డి, తమ్మనేని సుజాత, వేసపోగు గురుప్రసాద్, చీమలదిన్నె వెంగయ్య, ఖాజా మొహిద్దిన్, పోలక సిద్ధారెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, చింతకుంట్ల కిషోర్ బాబు, దాదిరెడ్డి మాల కొండారెడ్డి, షేక్ పోలీచర్ల రహీం భాష, గూడూరి అనిల్ బాబు, అయిమల్ల నాగమణి, పలుకూరి భాస్కర్, బలసాని మోహన్, దరిశి ఫణి కుమార్, బత్తుల మాలి, గాలి నాగేశ్వరరావు, గోన సదానంద, యర్రబల్లి దేవరాజ్, మూలే యోగి రెడ్డి, షేక్ నజీమ్, షేక్ రెహమాన్, దమ్ము వెంకటయ్య, పాప బత్తిన నాగేశ్వరరావు, బలసాని యెహోషువ, షేక్ సన్నీ, షేక్ మీరావళి, కొండయ్య, షేక్ ఖాదర్ జిలాని, పైడాల రామ్మోహన్ రెడ్డి, వంకదారి రాజా, ఎర్రబల్లి సౌరీలు, సంగు వెంకటేశ్వర రెడ్డి, నల్లగంగుల శ్రీను, షేక్ సమద్, ఓర్సు శ్రీనివాసులు, గోడి నారాయణరెడ్డి, వీరం రెడ్డి రవీంద్రారెడ్డి, సంగటి మహేందర్ రెడ్డి, షేక్ షకీల, మద్దిశెట్టి భారతి, మూల శ్రీనివాసులు, చీమలదిన్నె శివ, షేక్ అహ్మద్ భాష, వెన్నపూస నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.