ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి
అర్జీలను పరిశీలించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం, సెప్టెంబర్ 28:
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంలో జాప్యం చేయరాదని, ప్రతి వినతిని సంబంధిత అధికారులు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులకు తగిన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ, అర్జీలపై నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.