BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 28 September 2026, 02:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లా తొలి డీఆర్వోగా శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
28 Sep, 2026 - 02:20 PM
0 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మార్కాపురం, సెప్టెంబర్ 28:

మార్కాపురం జిల్లా నూతన రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా శ్రీదేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి డీఆర్వోగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం ఏలూరు జిల్లా డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవిని మార్కాపురం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెకు రెవెన్యూ శాఖలో విస్తృత అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గతంలో గిద్దలూరు, కొమరోలు, కంభం తదితర మండలాల్లో తహసీల్దార్‌గా శ్రీదేవి విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆమెకు ఉంది.

మార్కాపురం జిల్లాకు తొలి డీఆర్వోగా శ్రీదేవి నియామకంతో జిల్లా రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన కీలక బాధ్యతలు ఆమె పరిధిలోకి రానున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.