BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు
Date of Publish : 13 May 2026, 01:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:37 PM
141 వీక్షణలు

మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఐఏఎస్

ఏపీ, విజయవాడ, మే 12: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏపీబీజేఏ) ఆధ్వర్యంలో ఈ నెల 17న ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ మహాసభల ఆహ్వాన పత్రికను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఐఏఎస్ ఆవిష్కరించారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కలిమి శ్రీ, ప్రధాన కార్యదర్శి ఎం.బి. నాథన్, జిల్లా సెక్రటరీ రాఘవులు కలిసి కలెక్టర్‌తో పాటు ఎంపీ కేశినేని చిన్ని ని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ అంశాలు, వృత్తి పరమైన సవాళ్లపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతకు ఈ సమావేశాలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సల్మాన్, కార్యదర్శి వి.సురేష్, సభ్యుడు అవుటి బాబు, ఏపిబీజేఏ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు వి.వెంకట్, కార్యదర్శి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేయడానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.