మూలలంకలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో రూపొందించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా అందించేందుకు ఈ గుర్తింపు కార్డులను రూపొందించారు. ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మూలలంకలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నామాన అన్నవరం, రావాడి నాగ బాల బాలాజీ (బాలు), తంగెళ్ల పాండురంగారావు, కె. శ్రీనివాసరావు, దుగ్గిరాల నరేష్, గుప్తా, కాండ్రేగుల రామకృష్ణ, బొంతు శేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.