చిన్నకాపర్తి సర్పంచ్ సుందరయ్యకు జిల్లా కలెక్టర్, ఎస్పీ అభినందనలు
తెలంగాణ
/
నల్గొండ
ఎన్ టుడే న్యూస్ : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఇటీవల గుజరాత్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్–2026 వేడుకల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొని గ్రామానికి తిరిగి వచ్చిన ఆయనను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సుందరయ్య యాదవ్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతను చాటిచెప్పే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.