రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన
మణుబోతులగడ్డ, బండమీదిమామిడితండాల్లో బోర్‌వెల్ రీచార్జ్ పనులకు స్థల పరిశీలన, మార్కింగ్‌లు
ఖానాపూర్, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వివో భవన నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో వనపర్తి అద్వైత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనూష, పంచాయతీ కార్యదర్శి అబేదా, వివో ఏ పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ బాబులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.
శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన
వివో భవనం సమీపంలో శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అలాగే వి.బి.జీ. రాంజీ పనుల పురోగతి, కూలీల సమీకరణ తదితర అంశాలపై సమీక్షించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు.
బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలకు మార్కింగ్‌లు
అనంతరం మణుబోతులగడ్డ, బండమీదిమామిడితండా గ్రామపంచాయతీల పరిధిలో మూడు ప్రాంతాల్లో బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి మార్కింగ్‌లు నిర్వహించారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యత
భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ లక్ష్యంగా బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల పనులను త్వరితగతిన చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. వి.బి.జీ. రాంజీ పనుల ద్వారా కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు శ్రీలత, రమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రభావతి, ఈసీ అరుణ్ కుమార్, టీఏ రవి తదితరులు పాల్గొన్నారు.