BREAKING
thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం
Test 4
Date of Publish : 05 November 2026, 08:51 pm
Posted by : K MAHESH

ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
05 Nov, 2026 - 08:51 PM
11 వీక్షణలు

బీసీలంతా ఐక్యంగా పాల్గొనాలి.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు బొలుగుల నరసింహ పిలుపు

వలిగొండ, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఈనెల 7వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రం మీదుగా సాగనున్న నేపథ్యంలో బీసీలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు బొలుగుల నరసింహ కోరారు.

పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

గురువారం వలిగొండ మండల కేంద్రంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొలుగుల నరసింహ మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యంగా పోరాడి రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

రాష్ట్ర జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కొద్దిమంది ఉన్నత వర్గాల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందని ఆయన ఆరోపించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని, బీసీ రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు.

పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గొలుసుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల రమేష్, వలిగొండ టిప్పర్ అసోసియేషన్ నాయకులు గండికోట శ్రీశైలం, పల్లపు శ్రీశైలం, గండికోట రాజశేఖర్, గండికోట రాజు, ఓర్సు కనకసారయ్య, దుంప శ్రీను, ఓర్సు చందు, దండ్ల వెంకటేశం, దుంప రమేష్, పీట్ల ఐలేష్, దుంప సారయ్య తదితరులు పాల్గొన్నారు.