ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో
రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం సేకరించాలి: జి. జలంధర్ రెడ్డి
వలిగొండ, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం, లోతుకుంట, నర్సయ్యగూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జి. జలంధర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలి
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం, న్యాయబద్ధంగా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఏపీఎం, ఏఈఓ, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.