BREAKING
thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు
Test 4
Date of Publish : 05 November 2026, 08:56 pm
Posted by : K MAHESH

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
05 Nov, 2026 - 08:56 PM
14 వీక్షణలు

టీయూడబ్ల్యూజే-హెచ్ 143 దంతాలపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా కారుపోతుల రాములు గౌడ్ ఏకగ్రీవ ఎంపిక.. ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల విజయ్ కుమార్ గౌడ్

దంతాలపల్లి, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఆత్మగౌరవం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్-హెచ్ 143 నాయకులు పిలుపునిచ్చారు.

దంతాలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో గురువారం టీయూడబ్ల్యూజే-హెచ్ 143 మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈరగాని భిక్షం, జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య, జిల్లా కో-కన్వీనర్ గాడిపల్లి శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన మండల కమిటీ ఎన్నిక

నూతన మండల అధ్యక్షుడిగా కారుపోతుల రాములు గౌడ్ (సూర్య రిపోర్టర్)ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇతర పదవులకు ఎన్నికైన వారు:

  • గౌరవ అధ్యక్షులు: కన్నా కరుణాకర్ గౌడ్, గుగులోతు జుమ్కిలాల్

  • ఉపాధ్యక్షుడు: పడిదం నరేందర్

  • ప్రధాన కార్యదర్శి: పెరుమాండ్ల విజయ్ కుమార్ గౌడ్

  • కార్యదర్శి: గుండాల భూపాల్ యాదవ్

  • కోశాధికారి: మూరగుండ్ల ప్రశాంత్

  • ప్రచార కార్యదర్శి: నీలిగొండ ఉపేందర్

కార్యవర్గ సభ్యులు

జూజ్జురి వెంకటేశ్వర్లు, భూతం రమేష్, బానోతు యాకూబ్, రాపాక రామ్మూర్తి, సోమారపు నవీన్ కుమార్, కొండ వెంకన్న, మాలోతు సోమన్న, భూపతి కాశయ్య తదితరులను కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కారుపోతుల రాములు గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు మండల జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

సంఘాన్ని మండలంలో మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టులకు అండగా నిలుస్తూ వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నూతన కమిటీకి అభినందనలు

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు జర్నలిస్టులు పాల్గొని నూతన అధ్యక్షుడు కారుపోతుల రాములు గౌడ్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.