హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులు తరలి రావాలని ఇంటింటికీ కరపత్రం
NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్
కదిరి ప్రభుత్వ బాలికల కళాశాల మైదానంలో శనివారం సాయంత్రం 4.00 గంటలకు జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ బంధువులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరుతూ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కుమ్మరోళ్ళ పల్లి గ్రామంలో మరియు కదిరి పట్టణంలో ఇంటింటికీ కరపత్రం పంపిణీ చెయ్యడం జరిగింది. హిందూసాంప్రదాయాలను , ఆలయాలను , సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని సనాతన ధర్మం గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలి అంటే ప్రతి హిందువు కులాలకు , వర్ణాలకు , వర్గాలకు అతీతంగా ఇటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనాలని , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 వ సంవత్సరంలో స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంస్థ ద్వారా అన్యమతస్థుల దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ , దేశానికి , సమాజానికి ఆపద సమయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని అటువంటి సంస్థలను ఆదర్శంగా భావించాలని, ఈ ఆధునిక కాలంలో కులవృత్తులను , కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు అర్చకం శ్రీ కుమార్ రాజా ఆచార్యులు మరియు ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు తెలియజేశారు.














